గాడ్ ఫాదర్ నుండి సత్యదేవ్ లుక్ రిలీజ్

గాడ్ ఫాదర్ నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుండి నటుడు సత్యదేవ్ తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.
రీసెంట్ గా ‘సత్యప్రియ’గా నయనతార పాత్రను పరిచయం చేస్తూ ఆమె లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సత్యదేవ్ పోషించిన ‘జైదేవ్’ పాత్రకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సత్యదేవ్ డీసెంట్ లుక్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ‘సైరా’ తరువాత చిరంజీవి నుంచి వస్తున్న ఈ సినిమాపై అందరిలోను అంచనాలు ఉన్నాయి. ఈ మాస్ ఎంటటైనర్ మూవీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ , దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు.