ప్రధాని మోడీ కొత్త మంత్రివర్గం.. అన్ని వర్గాలకూ అవకాశం

కేబినెట్ లో చదువుకున్న వారూ ఎక్కువే

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా చేస్తున్న మంత్రివర్గ విస్తరణ ఇది. ఈసారి మంత్రివర్గంలో అన్ని వర్గాల వారికి ఎన్డీఏ సర్కారు సమ ప్రాధాన్యం ఇచ్చింది. చెప్పుకోదగిన రీతిలో మహిళలకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 43 మంది మంత్రులతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.

కొత్త కేబినెట్ లో వీరు…

•11 మంది మహిళలకు చోటు
•12 మంది దళితులకు చోటు. అందులో ఇద్దరికి ఫుల్ కేబినెట్ హోదా
•27 మంది ఓబీసీలకు చోటు. 19 వెనుకబడిన కులాల నుంచి ప్రాతినిధ్యం. అందులో ఐదుగురికి కేబినెట్ హోదా.
•ఏడు వేర్వేరు గిరిజన తెగల నుంచి 8 మంది ఎస్టీలకు అవకాశం
•ఐదుగురు మైనారిటీలకు మంత్రి పదవి
•బ్రాహ్మణులు, భూమిహార్, కయస్థ్, క్షత్రియ, లింగాయత్, పటేల్, మరాఠా, రెడ్డి వర్గాలకు చెందిన 29 మందికి మంత్రి పదవులు.
•మంత్రివర్గంలో 14 మంది 50 ఏళ్ల లోపు వారే. అందులో ఆరుగురికి కేబినెట్ బెర్త్ .
•మంత్రివర్గ విస్తరణ తర్వాత మోదీ టీమ్ సగటు వయసు 58 ఏళ్లు.
•కేబినెట్ లో 46 మందికి వివిధ రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం
•23 మంది మూడు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు ఎంపీగా గెలిచినవారే. దశాబ్దకాలానికిపైగా అనుభవం
•కొత్త కేబినెట్ లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులకు అవకాశం.
•25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నేతలకు ప్రాతినిధ్యం. దాదాపు దేశం నలుమూలలకు చెందిన వారికి అవకాశం.
•ఐదుగురు మంత్రులు ఈశాన్య రాష్ట్రాల వారు.

కాగా, కొత్త మంత్రివర్గంలో 13 మంది న్యాయవాదులు, 6గురు వైద్యులు, 5 గురు ఇంజనీర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పీహెచ్‌డీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యావంతులకు మోడి ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఎస్టీలు, ఇద్దరు ఎస్సీలకు కేబినెట్ హోదా ఇవ్వబోతున్నట్లు సమాచారం. సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌లకు పదోన్నతి లభిస్తుందని చెప్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/