70 స్థానాలతో విజయం సాదించబోతున్నాం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మరో నెల రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటీకే రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్..మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇటు కాంగ్రెస్ , బిజెపి పార్టీలు సైతం ఈసారి బిఆర్ఎస్ కు ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఆలోచనలో ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం ఈసారి ఎన్నికలు బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉండబోతున్నట్లు చెపుతున్నాయి.

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ హావ పెరిగింది. ఒక్క ఛాన్స్ కాంగ్రెస్ కు ఇద్దాం అనే ఆలోచనలో ప్రజలు ఉన్నట్లు పలు సర్వేలు చెపుతున్నాయి. అంతే కాకుండా గతంలో పార్టీ ని వీడిన వారంతా మళ్లీ సొంత గూటికే రావడం..ఇతర పార్టీల నేతలు సైతం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరుతుండడం తో అందరిలో నమ్మకం పెరుగుతుంది. ఇదే పార్టీ నేతలు చెపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో 70 స్థానాల్లో విజయం సాదించబోతున్నామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవారికి ప్రత్యేకంగా ప్రచారం అవసరం ఉండదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది కాబట్టి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ ను గెలిపించబోతున్నాయని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సాగునీటి రంగంలో కాళేశ్వరం, తాగునీటి రంగంలో మిషన్ భగీరథ రెండు స్కీంలు ఫేయిల్ అయ్యాయన్నారు.