ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటూ లోకేష్ ఫై రోజా కామెంట్స్

ఫైరింగ్ రోజా ఫైర్ అయ్యిందంటే అది మాములుగా ఉండదు. సినిమా నటి కావడం తో ప్రత్యర్థుల ఫై సినిమా డైలాగ్స్ పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పటికే పలుమార్లు నారా లోకేష్ ఫై సెటైర్లు వేసిన ఎమ్మెల్యే రోజా..మరోసారి లోకేష్ ఫై మండిపడింది. లోకేశ్ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని అన్నారు. కుప్పం ఎన్నికల నేపథ్యంలో గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నియోజకవర్గం లో పర్యటిస్తూ జగన్ ఫై నిప్పులు చెరుగుతున్నారు.

ఈ క్రమంలో రోజా మాట్లాడుతూ..లోకేశ్ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని అన్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన ఓ వీధి రౌడీ మాదిరే మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం అభివృద్ధిని పట్టని చంద్రబాబు, లోకేశ్.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం నియోజకర్గం ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రోజా అన్నారు. కోవిడ్‌ సమయంలోనూ చంద్రబాబు ప్రజలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఆయన కుప్పం నియోజకర్గంలో కనీసం తాగునీరు సదుపాయం కల్పించలేదన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందజేస్తున్న సంక్షేమ పథకాలను చూసి.. అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘనవిజయం సాదిస్తుందని రోజా ధీమా వ్యక్తం చేసారు.