మ‌హారాష్ట్ర‌లో భారీ ఎన్‌కౌంట‌ర్.. ఐదుగురు మావోల మృతి

గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు

గ‌డ్చిరోలి : మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గడ్చరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోలు హతమయ్యారు.

ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. వారిపై పోలీసులు ఎదుకాల్పులు జరిపారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. ఎన్ కౌంటర్ నేపథ్యంలో చుట్టుపక్కల అటవీప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/