మోడీ గో బ్యాక్ ఫ్లెక్సీలఫై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం

తెలంగాణ లో మోడీ పర్యటన నిరసిస్తూ వామపక్షాలు , విద్యార్థి సంఘాలు , చేనేత నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ గో బ్యాక్ అంటూ హైదరాబాద్ , రామగుండెం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో ఫ్లెక్సీలు కట్టారు. దీనిపై దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.

హైదరాబాద్ ను ప్లాస్టిక్ రహిత నగరంగా చేస్తానన్న వ్యక్తి.. హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖను చెత్తబుట్టలో వేసుకోండి.. లేదంటే గాంధీ భవన్ ను ఆ పేపర్ లతో తుడుచుకోండి అంటూ కామెంట్స్ చేశారు.

మరోపక్క మోడీ తెలంగాణ టూర్ కు టిఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. బీజేపీతో వార్ కొనసాగుతున్న క్రమంలో మోడీ టూర్ కు దూరంగా ఉండాలని , అలాగే ఎలాంటి నిరసనలు తెలియజేకుండా ఉండాలని నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారట. దీంతో కీలక నేతలతో పాటు స్థానిక నేతలు కూడా అందుబాటులో లేనట్లు తెలుస్తుంది.

ప్రధాని మోడీ వస్తుండటంతో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఏ ఒక్క నేత కూడా జిల్లాలో లేరట. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దపల్లి జిల్లాలోనే మోడీ సభజరుగుతున్న క్రమంలో.. ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి వారణాసికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కూడా హైదరాబాద్ చేరుకోగా.. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా నియోజకవర్గాన్ని వదిలి శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లినట్లు సమాచారం. మరి దీనిపై బిజెపి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.