మేం కుర్చీలు వెతుక్కునేలోపే అసెంబ్లీ వాయిదా పడింది – దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్

మేం కుర్చీలు వెతుక్కునేలోపే అసెంబ్లీ వాయిదా పడిందని అన్నారు దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్. రాష్ట్రంలో ఏ సమస్యలు లేవనే మాదిరిగా…అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులే నిర్వహించడం దారుణమన్నారు. గత ప్రభుత్వాలు సీపీఎం, లోక్‌సత్తా పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కరే ఉన్నా వారిని కూడా బీఏసీ భేటీకి పిలిచారు. ఈ విషయాన్ని కూడా స్పీకర్‌ వద్దకు తీసుకెళ్లాం. అయినా ఆయన మమ్మల్ని సమావేశానికి అనుమతించలేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ భేటీకి ఆహ్వానిస్తారో సభాపతి చెప్పాలి. మీరు ఇచ్చే నోటీసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం అని రఘునందన్ అన్నారు. సభాపతిని మరమనిషి అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడంపై.. నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

అసలు స్పీకర్ ను అవమానించింది ప్రశాంత్ రెడ్డినే అని రఘునందన్ రావు ఆరోపణలు చేసారు. నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి నీకు స్పీకర్ కు మధ్య జరిగింది ఏందో ఒక సారి చెప్పు అని చురకలు అంటించారు. ఏదో కారణం తో సభ నుండి బయటకు పంపించాలి అని చూస్తున్నారని…సమస్యల మాట్లాడకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. 20 రోజుల సభ జరగక పోతే మేము సభకు రామని భట్టి ఎందుకు డిమాండ్ చేయలేదు… బిజెపి నీ ఆహ్వానించాలని MIM ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఎవరినో వ్యక్తిగతంగా అవమానించాలని మాకు లేదని వెల్లడించారు.