గాల్వన్‌ ఘ‌ర్ష‌ణ‌పై స్పందించిన చైనా ఆర్మీ

భార‌త సైనికులే నియంత్రణ రేఖ‌ను దాటి వచ్చారు

China

చైనా:  గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ చైనా ఆర్మీ స్పందించింది. ఈ విషయంపై చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ తొలిసారి ఈ రోజు ఓ ప్రకటన చేసింది. చైనా వైపున ఉన్న భూభాగంలో ఆ ఘ‌ర్ష‌ణ జ‌రిగిందని చెప్పుకొచ్చింది. భార‌త సైనికులే నియంత్రణ రేఖ‌ను దాటి వచ్చారని, ఈ ఘర్షణకు భారత్‌ బాధ్య‌తవహించాలని వ్యాఖ్యలు చేసింది. లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌.. దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న అని అధికారులు తెలిపారు.  కాగా, చైనా ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌తినిధి వూ కియాన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ… స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిర‌త్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. రెండు దేశాల మ‌ధ్య కుదిరిన ఒప్పందాన్ని భార‌త సైన్యం ఉల్లంఘించిందని చెప్పుకొచ్చారు. ఈ ఘర్షణ అనంతరం ఇరు దేశాల‌కు చెందిన ర‌క్ష‌ణ‌శాఖ మంత్రులు ఫోన్‌లో మాట్లాడుకున్నారని తెలిపారు. అయితే జూన్ 15వ తేదీన జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో చైనా సైనికులు ఎంత మంది చ‌నిపోయార్న విష‌యాన్ని మాత్రం ఆ దేశ సైనిక అధికారులు వెల్ల‌డించ‌లేదు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/