జగన్ చేతగాని తనం వల్లే మృగాళ్లు రెచ్చిపోతున్నారు – నారా లోకేష్

జగన్ చేతగాని తనం వల్లే మృగాళ్లు రెచ్చిపోతున్నారు - నారా లోకేష్

ఏపీలో నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. చట్టాలకు ఏమాత్రం భయపడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు ఘటనలు చోటుచేసుకోగా…తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి యువతిని కర్రతో కొడుతూ.. హింసిస్తున్న వీడియో ఒకటి వైరలయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

నెల్లూరుజిల్లా రామకోటయ్య నగర్‌కి చెందిన ఉష అనే యువతి పట్ల వెంకటేష్‌ అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. వెంకటేష్‌ని అతడితో కలిసి నమ్మి నిర్జన ప్రాంతానికి వెళ్లిన ఉషను కర్రతో, చేతులతో విచక్షణ రహితంగా కొట్టాడు. ఆమె గాజులు పగిలి రక్తం కారుతున్న ఆ దుర్మార్గుడు కనికరం చూపించలేదు. అంతటితో ఆగకుండా .. ఈ కీచక పర్వాన్ని అతని మిత్రుడితో వీడియో తీయించి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఈ వీడియో వైరల్ గా మారడం తో ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటన పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

ఒక్క అవకాశం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్​ని ఆఫ్ఘనిస్తాన్​లా మార్చేశారని లోకేష్ అన్నారు. జగన్ రెడ్డి చేతగానితనాన్ని అలుసుగా తీసుకున్న మృగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. నెల్లూరు ఘటనను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. నెల్లూరులో మహిళని అత్యంత దారుణంగా హింసించడమే కాకుండా వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందే ధైర్యం చేస్తుండటం, రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల పేరుతో జరుగుతున్న మోసాన్ని పసిగట్టిన రాక్షసులు రోజుకో ఆడబిడ్డపై తెగబడుతున్నారని ధ్వజమెత్తారు.

ఒక్క ఛాన్స్ సీఎం ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేసారు. @ysjagan చేతగానితనాన్ని అలుసుగా తీసుకున్న మృగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. నెల్లూరు లో మహిళని అత్యంత దారుణంగా హింసించడమే కాకుండా వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందే ధైర్యం చేస్తున్నారు అంటే..,(1/2) pic.twitter.com/VIIdr3Skjf— Lokesh Nara (@naralokesh) September 15, 2021