రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులను తిరగరాయాలన్నా జగన్ కే సాధ్యం – మంత్రి రోజా

వైస్సార్సీపీ మంత్రి రోజా..మరోసారి సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేసింది. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులను తిరగరాయాలన్నా జగన్ కే సాధ్యమంటూ సినిమా డైలాగ్స్ పేల్చారు. ఏపీలో ఎన్నికల వేడి మొదలైందా..అంటే అవుననే చెప్పాలి. అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారం లోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి చేస్తారో..ఎలాంటి సంక్షేమ పధకాలు అందిస్తారో ప్రజలకు తెలియజేస్తున్నారు. అదే విధంగా ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఫైరింగ్ మంత్రి రోజా..టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ..జగన్ ఫై ప్రసంశలు కురిపించింది. పవన్ కల్యాణ్ ఇరిటేషన్ స్టార్, చంద్రబాబు ఇమిటేషన్ స్టార్ అని విమర్శించారు. సీఎం జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని అన్నారు. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులను తిరగరాయాలన్నా జగన్ కే సాధ్యమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీఎం జగన్ కాలు మీద వెంట్రుక కూడా పీకలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘హాయ్ ఏపీ.. బైబై బీపీ (బాబు, పవన్).. వన్స్ అగైన్ వైఎస్సార్సీపీ’ అంటూ వైస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సహం నింపింది. ఇచ్చిన మాట కోసం విజయ డెయిరీని సీఎం జగన్ పునఃప్రారంభిస్తున్నారని..తన హెరిటేజ్ సంస్థ కోసం విజయ డెయిరీని చంద్రబాబు మూయించారని ఆరోపించారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న విజయ డైయిరీకి జగన్ ప్రాణం పోస్తున్నారని చెప్పుకొచ్చింది.