మరో వివాదంలో పువ్వాడ ..

minister-puvvada

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రీసెంట్ గా బిజెపి కార్య కర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసులో పువ్వాడ పేరు ప్రముఖంగా వినిపించింది. పువ్వాడ వల్లే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు . ప్రస్తుతం ఈ వివాదం కొనసాగుతుండగానే మరో వివాదం పువ్వాడ ను అల్లుకుంది. విద్యార్థులను బెదిరించి వారికి వచ్చేటువంటి స్టైఫండ్ లాక్కున్నారని దళిత సంఘాలు పిర్యాదు చేసారు.

ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన… మమత మెడికల్ కాలేజీ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నారు. మమత మెడికల్ అలాగే డెంటల్ కాలేజీ యాజమాన్యం పీజీ విద్యార్థుల స్టైఫండ్ లాక్కుంటున్నారని దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఎదురుతిరిగితే ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారు వారు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ కు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దళితుల నోటికాడి కూడు కూడా లాక్కున్నారని..అజయ్ కుమార్ ను మంత్రి పదవి నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై పువ్వాడ ఏమంటారో చూడాలి.