నేడు కరీంనగర్ లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

TS Minister KTR
TS Minister KTR

హైదరాబాద్ : నేడు మంత్రి కేటీఆర్ క‌రీంన‌గ‌ర్ లో ప‌ర్య‌టించనున్నారు. ఈసందర్బంగా మంత్రి క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ రోజు ఉద‌యం 11:00 గంట‌ల‌కు క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణానికి చేరుకుంటారు. మానేరు వంతెన పై మిషన్ భ‌గీర‌థ వాటర్ పైలాన్ ను ప్రారంభిస్తారు. 24 గంట‌ల పాటు మంచి నీటిని స‌ర‌ఫ‌రా చేయ‌డానికి రూ. 410 కోట్ల నిధుల‌తో మానేరు రివ‌ర్ ఫ్రంట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. చొప్పదండిలోని సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/