మహేష్ బాబు తల్లి మృతి ఫై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణం ఫై సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. కొద్దీ రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇందిరాదేవి హైద‌రాబాద్‌లో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆమె క‌న్నుమూశారు. ఈమె మరణ వార్త తెలిసి చిత్రసీమ ప్రముఖులు , అభిమానులు ఆమెకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇందిరాదేవి మరణం పట్ల స్పందించారు. ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందన్నారు పవన్ కళ్యాణ్. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నానని తెలిపారు.

మహేష్ కు తన మాతృమూర్తి అయిన ఇందిరతో ఎంతో అనుబంధం ఉంది. అమ్మ పట్ల తనకున్న ఇష్టాన్ని ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా బయటపెట్టారు. ఎప్పుడూ సినిమా రిలీజ్‌కు ముందు తాను అమ్మ దగ్గరకు వెళ్లి కాఫీ తాగుతానని తెలిపిన మహేష్.. ఆ కాఫీ తాగితే నాకు దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకెంతో ముఖ్యం అంటూ మహేష్ తన తల్లి గురించి చెప్పుకొచ్చారు. ఎప్పుడు టెన్షన్‌గా అనిపించినా.. అమ్మ చేతి కాఫీ తాగుతానని మహేష్ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.