110 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

జగిత్యాల: నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లిలో నిర్మించిన 110 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. అనంతరం మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్లకు చేరుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/