నేటి నుండి మంత్రి కెటిఆర్‌ సుడిగాలి పర్యటన

ktr
ktr

హైదరాబాద్‌: నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఈరోజు నుండి గ్రేటర్‌లో ప్రచారం చేయనున్నారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 20 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. శనివారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రోడ్‌షో ప్రారంభించి.. కూకట్‌పల్లిలోనూ ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా, చిత్తారమ్మ తల్లి చౌరస్తా, రాత్రి 7గంటలకు ఐడీపీఎల్‌ చౌరస్తా, 8గంటలకు సాగర్‌ హోటల్‌లో జంక్షన్‌లో కెటిఆర్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. కాగా, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని గులాబీ దళం నిర్ణయించింది. డివిజన్లు, నియోజకవర్గ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు పూర్తి చేసింది. ఇందులో భాగంగా రోడ్‌ షోలకు ప్లాన్‌ చేస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/