ముఖ్య‌మంత్రిగా కెటిఆర్ స‌మ‌ర్థుడే.. మ‌ంత్రి గంగుల

హైదరాబాద్‌: గత రెండు మూడు రోజులుగా సిఎం కెసిఆర్‌ కుమారుడు మంత్రి కెటిఆర్‌ కాబోయే సిఎం అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. మంత్రి కెటిఆర్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అని, ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి అయ్యే అర్హ‌త ఉంద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కెటిఆర్ స‌మ‌ర్థుడే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పాల‌నాప‌రంగా కెటిఆర్‌కు మంచి అనుభ‌వం ఉంద‌న్నారు. కెసిఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. సిఎం అంశం త‌మ పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం.. బిజెపికి అన‌వ‌స‌రం అని మంత్రి గంగుల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన నచ్చి మాకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారని వెల్లడించారు. మంత్రి కెటిఆర్ వల్లే హైదరాబాద్‎కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని గంగుల ప్రశంసించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/