ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు చేయడానికి సిద్ధం

కమలా దేవి హారిస్ అను నేను.. అంటూ ప్రమాణ స్వీకారం

వాషింగ్టన్‌: అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతికి చెందిన కమలా హారిస్ అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగంపై నిజమైన నమ్మకం, విధేయత కలిగి ఉంటానని అన్నారు. తన విధిని స్వేచ్ఛగా స్వీకరిస్తానని, విదేశీ, స్వదేశీ శత్రువుల నుంచి అమెరికా రాజ్యాంగాన్ని కాపాడతానని అన్నారు. తాను చేపట్టబోయే పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నట్టు చెప్పారు. ఖభగవంతుడా, నాకు సహకరించుగ అని వేడుకున్నారు.

అనంతరం అధికారిక ట్విట్టర్ ద్వారా తొలి ట్వీట్ చేశారు. తానీరోజు ఈ పదవిలో ఉన్నానంటే అందుకు ఇంత వరకు ముందడుగు వేసిన మహిళలే కారణమని అన్నారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ట్వీట్‌కు తన తల్లి శ్యామల, పలువురు నల్లజాతి మహిళల ఫొటోలను జత చేశారు. నల్లజాతి డిజైనర్లు క్రిస్టఫర్ జాన్ రోగర్స్, సెర్గియో హడ్సన్‌లు రూపొందించిన ఊదారంగు దుస్తులు ధరించి ఖకమలాదేవి హారిస్ అను నేను..గ అంటూ ప్రమాణస్వీకారం చేశారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/