లాక్‌డౌన్‌ను నెమ్మదిగా ఎత్తివేయాలి

కోట్లాది మంది ఉపాధిని కోల్పోతున్నారు

jayaprakash narayana
jayaprakash narayana

హైదరాబాద్‌: దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను ఒక పద్దతి ప్రకారం ఎత్తివేయాలని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో కోట్లాది మంది ఉపాధిని కోల్పోతున్నారని, తెలిపారు. కాగా దేశంలో భారీగా కరోనా టెస్టింగ్‌ జరగాలని, విదేశాలతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువగా కరోనా టెస్ట్‌లు జరుగుతున్నాయని, జనాలు గుంపులుగా గుమికూడకుండా చూడాలని చెప్పారు. దేశంలో వయోవృద్దులను ఇంటినుండి బయటకు రాకుండా చూడాలని అన్నారు. 130 కోట్ల జనాభాలో 200 మంది చనిపోవడం పెద్ద సంఖ్య కాదని, మరింతగా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/