మహేష్ బాబు కు తీపి కబురు అందించిన ఏపీ సర్కార్

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్ల పెంపున‌కు ఏపీ ప్రభుత్వం అనుమ‌తి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర‌ పెంచుకోవ‌చ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీంతో ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తరహాలో సర్కారు వారి పాట సినిమాకు కూడా థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ రేట్లు పెంచనున్నాయి. గతంలో జగన్ దగ్గరకు వెళ్లి సినిమా టిక్కెట్ రేట్లు పెంచాలని అభ్యర్థించడంతో ఆయా హీరోలు నటించిన సినిమాలకు ప్రభుత్వం టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని అనుమతులు ఇస్తోంది.

ఇక సర్కారు వారి పాట విషయానికి వస్తే..ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించగా.. నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.