విష్షువర్దన్ రెడ్డి ఇంటికి చేరుకున్న మంత్రి హరీష్ రావు

minister-harish-rao-reached-vishnuvardhan-reddy-house

హైదరాబాద్ ః జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్షువర్దన్ రెడ్డి ఇంటికి తెలంగాణ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు . ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీలో చేరాలని జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్షువర్దన్ రెడ్డిను ఆహ్వానించారు హరీష్ రావు. దీంతో త్వరలోనే జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్షువర్దన్ రెడ్డి బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని విష్షువర్దన్ రెడ్డి కూడా తెలిపారు. త్వరలోనే బిఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పుకుంటానన్నారు.

మరోవైపు నిన్న ప్రగతి భవన్‌ లో బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున జూబ్లీహిల్స్‌ నియోజక వర్గం నుంచి బరిలో ఉండాలని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుకున్నారు. కానీ.. కాంగ్రెస్‌ టికెట్ అజారుద్దీన్‌ కు దక్కింది. బిఆర్‌ఎస్‌ టికెట్‌ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పుడు బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరి.. అజారుద్దీన్‌ ను ఓడించేందుకు సిద్ధం అవుతున్నారు విష్ణు వర్ధన్‌ రెడ్డి.