బీజేపీకి మంత్రి గంగుల కమలాకర్ స్ట్రాంగ్ వార్నింగ్..

బీజేపీకి టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటుగా తెలంగాణలో జరిగాయి. ఈ సమావేశాలకు వచ్చిన ప్రధాని మోడీ ఒక బీసీ బిడ్డగా బీసీలకు సంబంధించి ఒక పాజిటివ్‌ డిక్లరేషన్‌ చేస్తారని బీసీ వర్గాలు భావించాయి.

నిజానికి రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగానే కేంద్రంలోనూ ప్రత్యేకంగా బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఇప్పటికే మోదీ సర్కారును కోరామన్నారు. అలాగే బీసీ కుల గణన చేయాలని చాలా కాలంగా కోరుతున్నాం. ఈ విషయంలోసీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ శానసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. బీసీ జనాభా తేల్చాలని మోదీ సర్కారు ముందు ప్రతిపాదనలు పెట్టాం. ఇది ఒక తెలంగాణవాసుల డిమాండ్‌ కాదు, దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్‌. కానీ, ఈ విషయంలో బీజేపీ నిర్లక్ష్యం చూపుతున్నదని విమర్శించారు.

ఇక మా ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము బీజేపీకి ఉందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేను టచ్ చేసి చూడండీ.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీలో ఉన్న ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలను కాపాడుకోండి..వాళ్లు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కాపాడుకోండీ అంటే ఎద్దేవా చేశారు.కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము ధైర్యం ఎవ్వరికి లేదని..కేసీఆర్ ను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కేసీఆర్ కు వీరాభిమానులని..అభిమానులను టచ్ చేసే దమ్మ ఎవ్వరి లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.