సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమయాత్ర ప్రారంభం..

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమయాత్ర ప్రారంభం..
Sirivennela physique in the Film Chamber for fans to visit

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఫిల్మ్‌ఛాంబర్‌ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. అంతిమయాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కాసేపట్లో మహాప్రస్థానంలో సిరివెన్నెల హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరపనున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం.. అభిమానులతో పాటు టాలీవుడ్​లో విషాదం నింపింది. దీంతో నటులు, దర్శకులు, నిర్మాతలు.. సోషల్ మీడియా వేదికగా సిరివెన్నెలకు నివాళి అర్పిస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల భౌతికకాయానికి సినీ , రాజకీయ ప్రముఖులు , అభిమానులు నివాళ్లు అర్పిస్తున్నారు.

కొద్దిసేపటి క్రితం సిరివెన్నెల భౌతికకాయానికి సినీ నటులు పవన్ కళ్యాణ్ , జూ. ఎన్టీఆర్, మంత్రి హరీష్ రావు నివాళ్లు అర్పించారు. త్రివిక్రమ్ వారిద్దరితో మాట్లాడి ఈ ఘటన ఎలా జరిగిందనేది తెలియజేసారు. అంతకుముందు నాగార్జున , మహేష్ బాబు లతో పాటు రాజమౌళి, చిరంజీవి, గుణశేఖర్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, హీరో వెంకటేశ్‌, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సీనియర్‌ నటులు తనికెళ్ల భరణి, రావు రమేష్‌, అల్లు అరవింద్, మణి శర్మ, ఆచంట గోపినాథ్, పరుచూరి గోపాలకృష్ణ, సునీత, రామ జోగయ్య శాస్త్రి, నందిని రెడ్డి, ఎమ్మెస్ రాజు, అశ్వినిదత్, సాయికుమార్, కళ్యాణ్ మాలిక్, కాసర్ల శ్యామ్, సి కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, డివివి దానయ్య, బుర్ర సాయి మాధవ్, మురళి మోహన్, అల్లు అర్జున్, ఆర్టీసీ ఎండి సజ్జనార్, అల్లు అర్జున్ మొదలగువారు నివాళ్లు అర్పించారు.