మంత్రి హరీష్ రావు కు..అంబటి రాంబాబు సవాల్

ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత తెలంగాణ మంత్రి హరీష్ రావుకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని అంబటి రాంబాబు అన్నారు. తమ రాష్ట్రంలో బలహీనం అయిపోతున్నారా అని హరీష్ రావు ప్రశ్నించారు. అలాగే, రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు హరీష్ రావు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. గత రెండు రోజులుగా మంత్రి హరీష్ రావు ఫై వైస్సార్సీపీ నేతలు అగ్రం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని.. కానీ తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులకు 73% ఫిట్మెంట్ ఇచ్చామని హరీష్ రావు అన్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ లాగా కేంద్రం షరతులకు ఒప్పుకొని ఉంటే.. ఏటా ఆరువేల కోట్లు అప్పులు తీసుకుని మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే వారమని హరీష్ రావు అన్నారు. ఇక హరీష్ రావు వ్యాఖ్యల ఫై ఇప్పటికే పలువురు వైస్సార్సీపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వగా..తాజాగా శనివారం తాడేపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..హరీష్ కు సవాల్ విసిరారు.

రాష్ట్ర ఆదాయాలు తక్కువగా ఉన్నా అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత తెలంగాణ మంత్రి హరీష్ రావుకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని అంబటి రాంబాబు అన్నారు. తమ రాష్ట్రంలో బలహీనం అయిపోతున్నారా అని హరీష్ రావు ప్రశ్నించారు. అలాగే, రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు హరీష్ రావు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. జీతాలు కొంచెం లేట్ అవుతున్న మాట వాస్తవమే అన్నారు.