వాటన్నింటినీ అభివృద్ధి చేస్తాం..ఆళ్లనాని

చంద్రబాబు పాలనలో భ్రష్టుపట్టిన వైద్యఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తాం..

minister-Alla Nani

అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ హిందూపురం పార్లమెంటు పరిధిలో ఆగస్టు నెలలో నిర్మాణం చేపట్టబోయే మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి పెనుకొండ జాతీయ రహదారి సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. సిఎం జగన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టారన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని… వాటన్నింటినీ అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్టులో దాదాపు నాలుగు వందల కోట్లతో టెండర్లు పూర్తి చేసి అతి త్వరలో పనులు పూర్తి చేస్తామని మంత్రి ఆళ్లనాని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/