టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై నిషేధం

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

India Govt banned 59 Chinese Mobile App

న్యూఢిల్లీ: లడఖ్ లో జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన 21 మంది సైనికులు మరణించడంతో దేశవ్యాప్తంగా చైనా అంటే ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ సహా 59 యాప్ లను నిషేధించింది. భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి, దేశ రక్షణకు, ప్రజా సంక్షేమానికి హానికరంగా భావిస్తున్న కార్యకలాపాలతో సంబంధం ఉందన్న కారణంతో ఈ యాప్ లను అడ్డుకుంటున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

నిషేధిత యాప్‌ల జాబితా ఇదే…

టిక్‌టాక్‌, షేర్‌చాట్‌, క్వాయి, యూసీ బ్రౌజర్‌, బైయిదూ మ్యాప్‌, షెయిన్‌, క్లాష్‌ ఆఫ్‌ కింగ్స్‌, డీయూ బ్యాటరీ సేవర్‌, హలో, లైకీ, యూక్యామ్‌ మేకప్‌, మీ కమ్యూనిటీ, సీఎమ్‌ బ్రౌజర్స్‌, వైరస్‌ క్లీనర్‌, ఏపీయూఎస్‌ బ్రౌజర్‌, రామ్‌వీ, క్లబ్‌ ఫ్యాక్టరీ, న్యూస్‌డాగ్‌, బ్యూటీప్లస్‌, వీచాట్‌, యూసీ న్యూస్‌, క్యూక్యూ మెయిల్‌, వీబో, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్‌, బిగో లైవ్‌, సెల్ఫీసిటీ, మెయిల్‌ మాస్టర్‌, ప్యారెలాల్‌ స్పేస్‌, మీ వీడియో కాల్‌, వీ సింక్‌, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, వైవా వీడియో, మెయితూ, విగో వీడియో, న్యూ వీడియో స్టేటస్‌ డీయూ రికార్డర్‌, వాల్ట్‌ హైడ్‌, క్యాష్‌ క్లీనర్‌, డీయూ క్లీనర్‌, డీయూ బ్రౌజర్‌, హగో ప్లే, క్యామ్‌ స్క్యానర్‌, క్లీన్‌ మాస్టర్‌ (ఛీతా మొబైల్‌), వండర్‌ కెమెరా, ఫొటో వండర్‌, క్యూక్యూ ప్లేయర్‌, వీ మీట్‌, స్వీట్‌ సెల్ఫీ, బైయిదూ ట్రాన్స్‌లేట్‌, వీమేట్‌, క్యూక్యూ ఇంటర్నేషనల్‌, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ లాంఛర్‌, యూ వీడియో, వీ ఫ్లై స్టేటస్‌ వీడియో, మొబైల్‌ లెజెండ్స్‌, డీయూ ప్రైవసీ.


కాగా సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాపై భారత్‌ ఆర్థిక యుద్ధానికి తెరలేపింది. టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 మొబైల్‌ యాప్స్‌పై నిషేధం విధించింది. దేశభద్రత, సార్వభౌమత్వానికి ఈ యాప్స్‌ ప్రమాదకరంగా మారాయని సోమవారం ప్రకటించింది. యూజర్ల సమాచారాన్ని ఈ యాప్స్‌ దుర్వినియోగం చేస్తున్నాయని నిఘావర్గాలు తేల్చటంతో నిషేధం విధించినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సాంకేతిక సమాచార శాఖ తెలిపింది. ఈ యాప్స్‌ నిషేధంతో చైనా టెక్‌ కంపెనీలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని టెలికం నిపుణులు చెప్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/