పాల అటుకులు
రుచి: వెరైటీ వంటకాలు

వంటకు సమయం లేనప్పుడు సింపుల్గా పాల అటుకులు చేసి పిల్లలకు పెట్టవచ్చు. పాల అటుకులు రుచికరంగా ఉంటాయి.
కావలసిన పదార్థాలు:
అటుకులు ఒక కప్పు, బాదం పప్పులు – ఎనిమిది, పిస్తా పప్పులు – ఎనిమిది, ఖర్జూరాలు – నాలుగు, బెల్లం -రుచికి సరిపడినంత, పాలు ఒక కప్పు.
తయారుచేసే విధానం
ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచుకున్న అటుకులను ఒక పాత్రలో వేసుకోవాలి. బాదం, పిస్తా, ఖర్జూరాలను ముక్కలుగా తరిగి అందులో కలుపుకోవాలి.
ఖర్జూరాలు లేదా బెల్లం ముక్క వేసుకోవాలి.ఇప్పుడు వేడి వేడి పాలు పోసి అటుకుల మిశ్రమాన్ని నానబెట్టాలి. అయిదు నిమిషాలు ఆగి రుచికరమైన పాల అటుకులను ప్లేట్లో వడ్డించుకుని తినడమే.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/