పార్కింగ్‌కు స్థలాలు కేటాయించడంలో ప్రభుత్వం విఫలం

కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే మెట్రో పూర్తయ్యేది కాదు

k laxman
k laxman

హైదరాబాద్‌: మెట్రో రైలు పార్కింగ్‌, పుట్‌పాత్‌లకు స్థలాలు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్రా అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. మైట్రో రైలు ప్రారంభోత్సవం టిఆర్‌ఎస్‌ పార్టీ సొంత వ్యవహారంలా చేసిందని దుయ్యబట్టారు. శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట లక్ష్మణ్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే మెట్రో రైలు పనులు పూర్తయ్యేవే కాదన్నారు. టీఆర్ఎస్ వైఫల్యం వల్లే యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రావట్లేదన్నారు. మజ్లిస్ ఒత్తిడితోనే పాతబస్తీకి మెట్రోను తీసుకెళ్లడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. ఈసీఐఎల్, కొంపల్లి, అల్వాల్‌కు మెట్రోని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/