కవితకు హైకోర్టులో ఊరట

ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేసిన హైకోర్టు

MP Kavitha Maloth
MP Kavitha Maloth

Mahabubabad: : మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు హైకోర్టులో ఊరట లభించింది. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారంటూ నమోదైన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన జైలు శిక్షను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది.. ప్రధాన నిందితుడు మహ్మద్ షౌకత్ వాంగ్మూలంతోనే శిక్ష విధించారని, ఈ నేరాంగీకార వాంగ్మూలం చట్ట ప్రకారం చెల్లదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును రద్దు చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: