హైదరాబాద్ లో భారీ వర్షం

మరో రెండు రోజుల పాటు తేలిక‌పాటి వ‌ర్షాలు

Heavy rain in Hyderabad
Heavy rain in Hyderabad

Hyderabad: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో గాలులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది అమీర్ పేట, మెహిదీపట్నం, బండ్లగూడ జాగీర్,  కొండాపూర్, మాదాపూర్, గ‌చ్చిబౌలి ఎల్బీ నగర్, తార్నాక, జీడిమెట్ల, అల్వాల్, హయత్ నగర్, నాగోలు, రాజేంద్రనగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. భారీ ఈదురుగాలులు వీస్తుండ‌టంతో క‌రెంట్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో తేలిక‌పాటి వ‌ర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపింది

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/