గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగులకు మెగా హెల్త్ చెకప్ శిబిరం

ప్రారంభించిన కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి: శని, ఆది వారాల్లో వైద్య పరీక్షలు

Collector M. Venugopal Reddy is starting a medical camp in Guntur Collectorate on Saturday. Joint Collector G. Rajakumari, DRO Chandra Shekhar Rao and others can be seen in the photo
Collector M. Venugopal Reddy is starting a medical camp in Guntur Collectorate on Saturday. Joint Collector G. Rajakumari, DRO Chandra Shekhar Rao and others can be seen in the photo

Guntur : కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ హాల్ వద్ద ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ఏర్పాటు చేసిన మెడికల్ హెల్త్ చెకప్ క్యాంపును శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లను, పరికరాలను జిల్లా కలెక్టర్ ఎం. వేణు గోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి. రాజకుమారి తో కలిసి పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికి పూర్తి స్థాయిలో
హెల్త్ చెకప్ చేయాలని ఉద్దేశంతో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఉద్యోగస్తులు చాలా మంది వారికి వున్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ప్రాధమిక స్థాయిలో చికిత్స తీసుకోకపోవటం వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి సమస్యను తొలగించటానికి
మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్ష, ర్యాండమ్ బ్లడ్ షుగర్, హెచ్.బి.ఎ1సి, సెరమ్ క్రియాటిన్, బ్లడ్ యూరియా, లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయడ్ ప్రొఫైల్ టెస్టులు చేపట్టడం జరుగుతుందని, ఇవే కాకుండా యూరిన్ ఎనాలసిస్, ఈసిజి, 2డి ఎకో పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. దీనితో పాటు మహిళలకు ఎక్సరే, మెమోగ్రఫీ చేస్తున్నారని కొంతమందికి కంటి పరీక్షలు, దంత సమస్యలు, ఈఎన్టి పరీక్షలు, జనరల్ మెడిసిన్, గైనిక్ మెడిసిన్ కన్సల్టేషన్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. టెస్టులు అయిన తరువాత ట్రీట్మెంట్ చేసి మందులు ఇవ్వటం జరుగుతుందన్నారు.

Doctors conducting medical examination of Joint Collector G. Rajakumari in the camp
Doctors conducting medical examination of Joint Collector G. Rajakumari in the camp

ఈ హెల్త్ క్యాంపు ఈరోజు, రేపు (15,16 తేదీలలో) నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ మెడికల్ క్యాంపును జి.జి.హెచ్ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ డి.ఎం.అండ్ హెచ్.ఓ, డి.సి.హెచ్.ఎస్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ పర్యవేక్షిస్తున్నారన్నారు. సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, డి.ఆర్.ఓ చంద్రశేఖర్. రావు పూర్తి స్థాయిలో ఈ మెడికల్ క్యాంపును పర్యవేక్షిస్తారన్నారు. ఈ మెడికల్ క్యాంపుకు గుంటూరు జి.జి.హెచ్, మణిపాల్ వైద్యశాల, లలిత సూపర్ స్పెషాలిటీ వైద్యశాల, కాటూరి మెడికల్ కళాశాల, ఆదిత్య వైద్యశాల, శ్రీ హాస్పిటల్, డా.ఆగర్వాల్ కంటి వైద్యశాల, ప్రత్యూష డెంటల్, స్మైల్ డెంటల్, కాశ్వీ డెంటల్ వైద్యశాలలు తమ సిబ్బందితో, మేషనరీతో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని, ఉద్యోగులు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలని నిర్లక్ష్యం చేయవద్దని కోవిడ్ తరువాత పూర్తి స్థాయిలో ఈ మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నoదున అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నామన్నారు.

ఆర్ డి ఓ ప్రభాకర్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రావు, జి జి హెచ్ సూపరింటెండెంట్ డా. ప్రభావతి, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ జయరామ కృష్ణ, డి ఈ ఓ శైలజ, డి ఎస్ ఓ పద్మ శ్రీ, కలెక్టరేట్ ఏ ఓ పూర్ణ చంద్ర రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/category/telangana/