సీఎం జగన్‌తో రాజ్యసభ అభ్యర్థుల సమావేశం

Meeting of Rajya Sabha candidates with CM Jagan

అమరావతిః రాజ్యసభ బరిలో నిలిచిన వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులు ముగ్గురూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. రాజ్యసభ లోని మూడు సీట్లకు పోటీ చేయడానికి వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలను వైఎస్‌ఆర్‌సిపి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నేతలు సోమవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు సీఎం నివాసంలో జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభలో ఖాళీ అయిన మూడు సీట్లకు టిడిపి పోటీపడితే ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. టిడిపి తన అభ్యర్థులను నిలబెట్టకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి జగన్ తో వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.