కారులోని మహిళలపై క్యాబ్‌డ్రైవర్‌ లైంగిక వేధింపులు

ప్రయాణిస్తున్న కారు నుంచి దూకేసిన మహిళలు

Cab driver harassment of women in car

Amritsar: ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న క్యాబ్‌ నుంచి దూకిన సంఘటన అమృత్‌సర్‌లో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం ఓ క్యాబ్‌డ్రైవర్‌ వేధింపులు భరించలేక వారు కారు నుంచి దూకేశారు..

స్థానికులు గమనించి కారును వెంబడించి అందులోని మరో మహిళను కాపాడారు..

కాగా రంజిత్ అవెన్యూ లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లటానికి ముగ్గురు మహిళలు క్యాబ్‌ను బుక్‌చేశారు..

మార్గమధ్యంలో డ్రైవర్‌ కారులో కూర్చుని ఒక మహిళపై వేధింపులకు దిగాడు.. ఆమె ప్రతిఘటించింది.. దీంతో డ్రైవర్‌ వేగాన్ని పెంచి, మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు.. డ్రైవర్‌నుంచి తప్పించుకోవాలని ఆ మహిళలు కదలుతూఉన్న కారు నుంచి దూకేశారు.

ఈ ఘటనలో దూకినవారికి గాయాలయ్యాయి.. స్థానికులు వెంబడించి మరో మహిళను కాపాడారు. పోలీసులు రంగప్రవేశం చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తుచేస్తున్నట్టు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/