జార్జ్ ఫ్లాయిడ్‌ది హత్యే !
యూఎస్ వైద్య పరీక్షల కార్యాలయం వెల్లడి

వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ (46) మృతికి నిరసనగా అమెరికా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. మే 25న శ్వేతజాతి పోలీసుల చేతిలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు చనిపోవడంతో అగ్రరాజ్యంలో నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. నల్లజాతీయులు ఏకంగా తమ ఆందోళనలతో శ్వేతసౌధాన్ని కూడా ముట్టడించారు. ఈనేపథ్యంలో ఫ్లాయిడ్‌కు సంబంధించిన కీలకమైన అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. ఫ్లాయిడ్ మెడపై బలమైన ఒత్తిడి వలన ఆక్సిజన్ అందక మృతిచెందాడని, ఇది నరహత్య అని మిన్నెపోలిస్‌లోని హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. మెడపై ఒత్తిడి కారణంగా మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోవంతో చనిపోయాడని పరీక్షల్లో తేలింది. అంతేగాక ఫ్లాయిడ్ ఇటీవలి మెథాంఫేటమిన్ఖి వాడకం, ఫెంటానిల్ మత్తు, రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి కూడా అతని మరణానికి కారణమయ్యాయని యూఎస్ వైద్య పరీక్షల కార్యాలయం వెల్లడించింది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/