ఉస్మానియా వైద్యకళాశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా

coronavirus
coronavirus

హైదరాబాద్‌: ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా తీవ్ర కలలకం రేపింది. 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ తెలిపారు. ఉస్మానియాలో మొత్తం 296 మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులంతా హాస్టల్‌లో ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఐతే హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై 180 మంది విద్యార్థినులు, 116 మంది విద్యార్థులకు పరీక్షలు చేయించారు. వీరిలో 12 మందికి పాజిటివ్ వచ్చింది. మరికొందరు విద్యార్థుల రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా 5 రోజుల క్రితం ఓయూ వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను డీఎంఈ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఖండించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/