గాంధీలో మీడియాకు ఇకపై అనుమతి లేదు

ఆసుపత్రి ఆవరణలో ఆంక్షలు విధింపు

Media is not allowed in Gandhi hospital
Media is not allowed in Gandhi hospital

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) భయం ఇప్పుడు తెలంగాణను వెంటాడుతోంది. రోజురోజుకీ కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ భయం మరింత కలవరపెడుతోంది. తెలంగాణలో 457కు కరోనా అనుమానితుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 42 అనుమానిత కేసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో నమోదవడం గమనార్హం. ఈరోజు వరకూ 18224 మందికి థర్మల్ స్క్రీనింగ్స్ నిర్వహించారు. ప్రస్తుతం గాంధీలో ఒక్కటే పాజిటీవ్ కేసు నమోదైంది. గాంధీ ఆసుపత్రి వద్ద ఆంక్షలు విధించారు. మీడియాకు ఇక మీదట గాంధీ ఆవరణలో అనుమతి లేదు. మీడియా ప్రతినిధులు.. మీడియా వాహనాలను.. ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల ఆదేశాలు జారీ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/