తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ఉదయం 8గంటల నుండే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు

హైదరాబాద్: నేటి ఉదయం 8గంటల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9.65లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో4.8 లక్షల మంది మొదటి సంవత్సరం పరీక్షలకు, 4.85లక్షల మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. లొకేటర్ మొబైల్ యాప్ ద్వారా పరీక్షా కేంద్రం తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/