కర్ణాటకలో భారీగా బంగారం, నగదు పట్టివేత

Massive seizure of gold and cash in Karnataka

న్యూఢిల్లీః లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక పోలీసులు భారీ స్థాయిలో బంగారం , నగదును స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి పట్టణంలో దాడులు చేపట్టిన పోలీసులు.. ఓ నగల దుకాణం యజమాని నరేశ్‌ ఇంట్లో ఏకంగా రూ.5.60 కోట్ల నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

నగదుతోపాటు 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలతోపాటు 68 వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగలు, బంగారం విలువ రూ.7.60 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు దుకాణం యజమాని నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఇదంతా హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు.