విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు క్షమాపణలు తెలిపిన సమంత

విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివనిర్వాణ డైరెక్షన్లో ఖుషి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి మూవీ లో జోడి కట్టిన సామ్ – విజయ్ మరోసారి ఈ మూవీ తో కనువిందు చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన కొద్దీ రోజులకే సామ్ అనారోగ్యం పాలవ్వడం తో షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం సమంత కోలుకోవడం తో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటూ ఓ అభిమాని ట్విట్టర్ లో సమంత ను ప్రశ్నించగా.. దానికి సమాధానం ఇచ్చింది. త్వరలోనే మొదలవుతుందని చెబుతూ, విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు (సినిమా ఇంతకాలం నిలిచిపోయినందుకు) అంటూ ట్వీట్ చేసింది. దీనికి అభిమానులు స్పందిస్తూ ముందు ఆరోగ్యం జాగ్రత్త అంటూ సలహాలు ఇస్తున్నారు.

ఇక సమంత నటించిన శాకుంతలం మూవీ ఈ నెల 17 న పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ , ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ & దిల్ రాజు లు నిర్మించారు.