భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 634 పాయింట్లు లాభపడి 63,782కి ఎగబాకింది. నిఫ్టీ 190 పాయింట్లు పెరిగి 19,047కి చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద కొనసాగుతుంది.