ఫిఫ్త్‌ గేర్‌ వెంచర్స్‌ను కొనుగోలు చేసిన మహీంద్రా

mahindra and mahindra
mahindra and mahindra

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయరీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఈ -కామర్స్‌ సంస్థ ఫిఫ్త్‌ గేర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌జీవీఎల్‌)ను కొనుగోలు చేసింది. ఈ మేరకు షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదిరినట్లు శనివారం ఎంఅండ్‌ఎం ప్రకటించింది. దీంతో మహీంద్రా అనుబంధ సంస్థ మహీంద్రా ఫస్ట్‌ గేర్‌ ఛాయిస్‌ వీల్స్‌ లిమిటెడ్‌(ఎంఎఫ్‌సీడబ్ల్యూఎల్‌)కు ఎఫ్‌జీవీఎల్‌ అనుబంధంగా పనిచేయనుందని తెలిపారు. ఈ కొనుగోలు ప్రక్రియ మార్చి 31, 2020 పూర్తి చేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు 2015లో నెలకొల్పిన ఎఫ్‌జీవీఎల్‌..కార్‌అండ్‌బైక్‌..కామ్‌ వెబసైట్‌ ద్వారా వాహనాల కొనుగోలు, సమీక్ష, ఇతరత్రా సేవల్ని అందిస్తోంది. తాజా దీన్ని కొనుగోలు చేయడంతో మహీంద్రా డిజిటల్‌ ప్లాట్‌ఫారంపై ముద్ర వేయాలని చూస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/