లాభాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు ఒడిదుడుకులకు లోనైన స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిశాయి. ఉదయం 17,923 పాయింట్ల వద్ద నిఫ్టీలో ట్రేడింగ్ ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 17,925 నుంచి 17,786 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 34.60 పాయింట్ల స్వల్ప లాభంతో 17,833 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 60,045 పాయింట్లతో సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,119 పాయింట్ల నుంచి 59,634 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 104.92 పాయింట్ల లాభంతో 59,793.14 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.54 వద్ద కొనసాగుతోంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/