లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

BSE
BSE

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 333 పాయింట్లు లాభపడి 66,599కి చేరుకుంది. నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 19,820 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.97 వద్ద కొనసాగుతుంది.