చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident
Road accident

అమరావతి : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా వడమాలపేట చెక్‌పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది మరో లారీ. దీంతో రోడ్డుకు అడ్డంగా పడిన లారీని ఢీకొట్టింది మరో కారు. ఈ తరుణంలోనే కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత కారును ఢీకొంది మరో బైక్. దీంతో మరో ఇద్దరు మృతి చెందారు. ఇలా వరుసగా వాహనాలు ఢీ కొట్టుకోవడంతో… ఏకంగా నలుగురు మృతి చెందారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.