నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

BSE
BSE

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 250 పాయింట్లు నష్టపోయి 60,431కి పడిపోయింది. నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 17,770 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.71 వద్ద కొనసాగుతుంది.