మరాఠా కోటాపై తీవ్ర ఆందోళన.. ఎమ్మెల్యే ఇంటికి నిరసనకారులు నిప్పు

Maratha quota violence: House of NCP MLA Prakash Solanke set on fire

ముంబయి: మహారాష్ట్రలోలో మరాఠా రిజర్వేషన్ లపై జరుగుతున్న ఆందోనళ హింసగా చెలరేగుతోంది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్‌ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్‌ ఆందోళనకారులు సోమవారం ముట్టడించారు. బీడ్‌ జిల్లాలోని ఆయన ఇంటిపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బిల్డింగ్‌ వద్ద ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మరాఠా రిజర్వేషన్‌ ఉద్యమ నాయకుడు మనోజ్‌ జరంగే పాటిల్‌ గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌ సోలంకే ఈ దీక్షపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మరాఠా కోటా నిరసనకారులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

కాగా, ఈ సంఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నట్లు ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తు తనతో పాటు తన కుటుంబ సభ్యులు, సిబ్బంది గాయపడలేదని చెప్పారు. తామంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఆందోళనకారులు ఇంటికి నిప్పు పెట్టడం వల్ల ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన వెల్లడించారు.