ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

Maoist killed in encounter in Chhattisgarh

న్యూఢిల్లీః ఈ మధ్య ఛత్తీస్‌గఢ్‌ వరుస ఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతుంది. తాజాగా ఈ దండకారణ్యంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో సోమవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా.. పలువురు జవాన్లు గాయపడ్డట్లు సమాచారం. ఈఘటన సలాతోంగ్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటన స్థలం నుండి భద్రతా దళాలు భారీగా పేలుడు పదార్థులు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భద్రతా దళాలు సెర్చ్ అపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి. మృతి చెందిన మావోయిస్టు వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం మరువకముందే తాజాగా మరో ఎన్ కౌంటర్ జరగడం గమనార్హం.