మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలి – రాజగోపాల్

రాజగోపాల్ రెడ్డి బిజెపి లో చేరడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది. ఆయ‌న పార్టీని వీడ‌కుండా ఉండేందుకు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, కాంగ్రెస్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త సునీల్ త‌దిత‌రులు సంప్ర‌దింపులు జరిపారు. అయినప్పటికీ రాజగోపాల్ వెనక్కు తగ్గడం లేదు. ఈరోజు రాజగోపాల్ తో ఉత్తమ్ తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం రాజగోపాల్ మీడియా తో మాట్లాడుతూ… రానున్న 10-15 రోజుల్లో కేసీఆర్​పై యుద్ధం ప్రకటిస్తానని తేల్చి చెప్పారు. కేసీఆర్​ భావిస్తే ఉప ఎన్నిక రాదని.. ప్రజలు సిద్ధంగా ఉంటే వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని వ్యాఖ్యానించారు. ఇది పార్టీల మధ్య యుద్ధం కాదని.. కేసీఆర్​ కుటుంబానికి, ప్రజలకు మధ్య జరిగే యుద్ధమని అభివర్ణించారు. అభివృద్ధిని కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్​కే పరిమితం చేశారన్న రాజగోపాల్​రెడ్డి.. కేసీఆర్​కు బుద్ధి చెప్పే ఎన్నిక వస్తుందన్నారు. తన రాజీనామా గురించి అమిత్​ షాతో మాట్లాడలేదని రాజగోపాల్​రెడ్డి స్పష్టం చేశారు.