వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలఫై కీలక ఆరోపణలు చేసిన నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌..వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలఫై కీలక ఆరోపణలు చేసారు. దేశంలోనే అతి పెద్ద స్కామ్ అంటూ పేర్కొన్నారు. బుధువారం మీడియాతో మాట్లాడుతూ…వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. రైతుల దగ్గర లంచాలు తీసుకున్న ఏకైక ప్రభుత్వం ఇదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పంట నష్టపోయిన రైతులు ఆర్బీకేల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, తూకాల్లో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 10,700 ఆర్బీకేల్లో అవినీతి జరుగుతున్నట్లు విజిలెన్స్‌ నివేదిక కూడా వెల్లడించిందన్నారు. జగన్ సీఎం అయ్యాకే రైతులను కూడా కులాల వారీగా గుర్తిస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇక, గంజాయి కేసుల్లో పెద్ద తలకాయల్ని వదిలేసి చిన్నవాళ్లను మాత్రమే అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.