రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న చంద్రబాబు
మోడీ అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు

న్యూఢిల్లీః రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం వారు అక్కడి నుంచి ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు. అక్కడ పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ప్రతిపాదించిన ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/