త్రివిక్రమ్ సతీమణి నృత్యరూపక ప్రదర్శనకు పవన్ చీఫ్ గెస్ట్ ..

సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా త్రివిక్రమ్ , పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితులు అనే సంగతి తెలిసిందే. తరుచు కలుసుకుంటూ అన్ని విషయాలు మాట్లాడుకుంటుంటారు. ఇరు ఫ్యామిలీ సభ్యులు కూడా కలుసుకుంటూ బంధువులుగా ఉంటారు. ఇప్పుడు ఈ బంధమే త్రివిక్రమ్ సతీమణి నృత్యరూపక ప్రదర్శనకు పవన్ కళ్యాణ్ వచ్చేలా చేసింది.

త్రివిక్రమ్ సతీమణి సౌజన్య ఎప్పుడూ మీడియా ముందు కనిపించరు. అందుకే ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె క్లాసికల్ డాన్సర్. చాలా గొప్పగా క్లాసిక్ డాన్స్ పెర్ఫామ్ చేయగల ప్రతిభ సౌజన్య త్రివిక్రమ్ కు ఉంది. పెళ్లికి ముందు చాలా స్టేజ్ ప‌ర్ఫార్మెన్సులు ఇచ్చినా కూడా ఆ త‌ర్వాత బ‌య‌టికి రాలేదు. పెళ్లి త‌ర్వాత పూర్తిగా ఇంటికి ప‌రిమిత‌మైపోయిన సౌజ‌న్య‌..అప్పుడప్పుడు స్టేజ్ ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మరోసారి తన టాలెంట్ ను నిరూపించబోతుంది.

రేపు హైదరాబాద్​లోని శిల్పాకళావేదికలో సాయంత్రం 6 గంటలకు ‘మీనాక్షి కల్యాణం’ నృత్యరూపక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హీరో పవన్​కల్యాణ్ విచ్చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం సాగర్ డైరెక్షన్లో భీమ్లా నాయక్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. అడవి బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్​.. ఫారెస్ట్​ పోలీస్ అధికారిగా నటించారు. రానా మరో ప్రధాన పాత్ర పోషించారు. నిత్యామేనన్, సంయుక్త హెగ్డే హీరోయిన్లు. జనవరి 12 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.